సాక్షి, గుంటూరు: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. కేసులు బనాయించి మరీ అతడ్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమ్మతం కాదని తీవ్రంగా ఖండించారాయన.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్ జగన్.. ఆ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి.. ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్‌ను బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని వైఎస్‌జగన్ ప్రశ్నించారు. తన ప్రమేయం లేకున్నా నేరుగా ఆయన్ని అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అరెస్టును ఖండించారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024
ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment