
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది. అదే విధంగా ప్రైవేట్ పార్టనర్‌ని గుర్తించే బాధ్యతను అప్పగించడం సహా.. ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్‌లతో నాలెడ్జ్ పార్టనర్‌లుగా ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఇటీవలే ఇందుకు ఆమోదం తెలిపింది.(చదవండి: కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు)
ఈ క్రమంలో ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీబీడీఐసీ) ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా. దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment