
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల విభజనపై నింబంధనలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులు, ఉద్యోగులు ప్రొవిజినల్ ఎలొకేషన్‌కి ఆదేశాలు ఇచ్చింది. జిల్లా, డివిజనల్ ఉద్యోగుల విభజన చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, డివిజనల్ ఉన్నతాధికారుల పోస్టులు మినహా.. కొత్త పోస్టులు సృష్టించొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఇప్పుడు చేపట్టే ఉద్యోగుల విభజన తాత్కాలికమేనని ప్రభుత్వం పేర్కొంది. తుది కేటాయింపులు మళ్లీ చేపడతామని స్పష్టం చేసింది. ఆర్డర్ టు సర్వ్ కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నెల 28 నుంచి మార్చి 11 వరకు ఉద్యోగుల కేటాయింపు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. ఫైనల్ గెజిట్ తర్వాత ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment