సాక్షి, అమరావతి: ఏపీలోని వాల్మీకి/ బోయ, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. శామ్యూల్ ఆనంద్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మూడు నెలల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది వాల్మీకి, బోయలు ఉన్నట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment