
సాక్షి, అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పాల్వాయి గేటు, కారంపూడి కేసుల్లో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. శుక్రవారం (ఆగస్ట్23) బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment