గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు తెలిపింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు.. ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కన్నాయి.
ఇక.. దాదాపు రూ. 12,065 కోట్ల పెట్టుబడితో 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. ఇందులో భాగంగా.. వైయస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్ 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయి.
నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. సుమారు 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుతో రూ.1287 కోట్ల పెట్టుబడి పెడుతూ.. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాల కల్పన చేపట్టనుంది.
శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.
రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ. ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
ఇక కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. రూ.1350 కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
అనంతపురం ఉమ్మడి జిల్లాలో 600 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్. ఇందుకోసం రూ.3,600 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. 600 మంది ఉద్యోగాలు దక్కున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment