100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను చోరీ చేసే యత్నం
పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు
తిరుమల: శ్రీవారి పరకామణిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బంగారు బిస్కెట్‌లను చోరీ చేయగా టీటీడీ విజిలెన్స్ అధికారుల అప్రమత్తతో నిందితుడు పట్టుబడ్డాడు. తిరుమల వన్‌టౌన్ పీఎస్ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన వీలిశెట్టి పెంచలయ్య తిరుమలలోని యూనియన్ బ్యాంక్ వారి అబ్రిబోస్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను పరకామణిలో నగదు, బంగారు, ఇతర విలువైన వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పరకామణి సిబ్బందికి అందిస్తుంటాడు.
ఈ క్రమంలో పరకామణి భవనంలోని మొదటి అంతస్తు నుంచి పైన ఉన్న మరో అంతస్తుకు ట్రాలీలో వస్తువులను తీసుకెళ్లే సమయంలో సమీపంలోని ఓ బంగారు వస్తువులు ఉన్న ట్రే వద్దకు వెళ్లివచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ విజలెన్స్ సిబ్బంది సదరు ట్రాలీని తనిఖీ చేయగా అందులో ఉన్న ఓ కన్నంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీ కెమేరా నిఘా కేంద్రంలో వీడియో ఫుటేజీని పరిశీలించి.. వన్‌టౌన్ పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment