సాక్షి, విశాఖపట్టణం : సమకాలీన ప్రపంచంలో జానపదానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కళారంగానికి తీరని లోటని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వంగపండు మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దశాబ్దాల తరబడి కళాసేవ చేస్తూ, జానపదాలతో ప్రజల గొంతుకను వినిపించిన వంగపండు, ప్రజల మదిలో చిరకాలం నిలిచి ఉంటారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భవగవంతుడుని ప్రార్ధించారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత)
జానపద రంగానికి తీరని లోటు: ఆళ్లనాని
విప్లవకవిగా తెలుగు రాష్టాల్లో పేరు పొందిన వంగపండు ప్రసాద్ రావు మృతి అత్యంత బాధాకరమని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఉత్తరంద్ర జానపదాలకు గజ్జ కట్టి పాడిన వంగపండు మరణం ఈ రాష్ట్రములో జానపద రంగానికి తీరని లోటు. ఆయన వందలాది జానపద పాటలను రచించారు. తనపాటలతో పల్లెకారులతో పాటు గిరిజనులను చైతన్య పరిచారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు. మూడు దశబ్దాలల్లో 300పాటలు రచించారు. వంగపండు కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకుప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని మంత్రి ఆళ్లనాని అన్నారు.
వంగపండు మృతి తెలుగు రాష్టాలకు తీరని లోటు: జర్నలిస్టు ఫోరం
వంగపండు మృతిపై విశాఖ జర్నలిస్టు ఫోరం సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి దుర్గారావు మీడియాతో మాట్లాడారు. 'ప్రముఖ వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు మృతి తెలుగు రాష్టాలకు తీరని లోటు. కళాకారుడుగా వంగపండు ప్రస్థానం ప్రసంశనీయం. నిరంతరం సమాంము కోసమే ఆయన తన ఆటపాటతో ముందుకు సాగారు.
ప్రజా సమస్యలను తన పాటల రూపంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించే గొప్ప వాగ్గేయకారుడు. తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి వంగపండు. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. వంగపండు మరణం యావత్ తెలుగు ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాము' అని అన్నారు. (చంద్రబాబుకు మతి తప్పింది)
Comments
Please login to add a commentAdd a comment