సాక్షి, విజయవాడ: టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండి చెయ్యే మిగిలింది. ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణ వ్యక్తికి కూడా టీటీడీలో చోటు దక్కలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారు.
టీడీపీ మేనిఫెస్టోలో టీటీడీ పాలకమండలిలో ఒక బ్రాహ్మణ వ్యక్తికి సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వగా, నిన్న ప్రకటించిన పాలకమండలిలో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణునికి కూడా అవకాశం దక్కలేదు. చంద్రబాబు మోసంపై బ్రాహ్మణ వర్గాలు మండిపడుతున్నాయి.
టీవీ–5 అధినేత బీఆర్ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనతోపాటు మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్లు బుధవారం టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా జగ్గంపేట, కోవూరు, మడకశిర ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, సాంబశివరావు (జాస్తి శివ), నన్నపనేని సదాశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment