సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ.. అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భీమాస్ పారడైజ్ రూం నంబర్ 105,109లో తన ప్రమేయం లేకుండా లైంగికదాడి చేసినట్లు ఫిర్యాదులో బాధితులు తెలిపింది. భీమాస్ పారడైజ్ హోటల్‌లో సీసీ పుటేజీని పోలీసులు సేకరించారు.
కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు.
తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment