నెలన్నర ఆలస్యంగా ఏపీ పాఠశాల విద్యా కేలండర్ విడుదల | Chandrababu's govt lately releases schools academic calendar 2024-25 | Sakshi
Sakshi News home page

నెలన్నర ఆలస్యంగా ఏపీ పాఠశాల విద్యా కేలండర్ విడుదల

Published Tue, Jul 30 2024 11:40 AM | Last Updated on Tue, Jul 30 2024 12:01 PM

Chandrababu's govt lately releases schools academic calendar 2024-25

సాక్షి, విజయవాడ: ఏపీలో స్కూల్స్ ప్రారంభమై నెలన్నర గడుస్తోంది. 2024-25 ఏడాదికి పాఠశాల విద్యా కేలండర్‌ను చంద్రబాబు ప్రభుత్వం నెలన్నర ఆలస్యంగా నిన్న(సోమవారం) విడుదల చేసింది. ఏపీలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2024-25 అకడమిక్ క్యాలెండర్ నిన్న (సోమవారం) విడుదలైంది. పాఠశాలల పనిదినాలు 232 రోజులు కాగా, సెలవులు 83 రోజులు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతీ రోజూ గంటపాటు ఆటల పిరియాడ్ ఉంటుంది. ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయని నిర్ణయించారు. 

పండగ సెలవులు..
దసరా సెలవులు: 04-10-2024 నుండి 13-10-2024
క్రిస్మస్ సెలవు: 25-12-2024 
సంక్రాంతి సెలవులు: 10-01-2025 నుండి 19-01-2025 వరకు ఉన్నాయి.

పరీక్షలు షెడ్యూల్‌.. 
ఎఫ్ ఎ 1 ఆగస్ట్ 27 నుంచి 31 వరకు 
ఎఫ్ ఎ 2 అక్డోబర్ 21 నుంచి 25 వరకు
ఎస్ఎ 1 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు.
ఎఫ్ఎ 3 జనవరి 27 నుంచి 31 వరకు
పదో తరగతి ప్రీ ఫైనల్ ఫివ్రవరి 10 నుంచి 20 వరకు
ఎఫ్ఎ4 మార్చ్ 3 నుంచి 7 వరకు
ఎఎస్ ఎ 2 ఏప్రిల్‌ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు అకడమిక్‌ కాలెండర్‌లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement