సీఎం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రులు వలంటీర్లు | Chevireddy Bhaskar Reddy Comments on Volunteers | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రులు వలంటీర్లు

Published Sun, Apr 17 2022 5:04 AM | Last Updated on Sun, Apr 17 2022 2:56 PM

Chevireddy Bhaskar Reddy Comments on Volunteers - Sakshi

వలంటీర్లతో ఎమ్మెల్యే చెవిరెడ్డి

పాకాల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వలంటీర్లు అత్యంత ప్రీతిపాత్రులని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వలంటీర్‌ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముకలా పని చేస్తోందన్నారు. శనివారం చిత్తూరు జిల్లా పాకాలలో వలంటీర్లను చెవిరెడ్డి సత్కరించి దుస్తులు అందజేశారు. క్షేత్ర స్థాయిలో వలంటీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు.

స్థానిక అధికారులు, నాయకులతో వలంటీర్లను సమన్వయపరచి భోజనం ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్లు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సకాలంలో సంక్షేమ పథకాలు అందించడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న వలంటీర్ల సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement