ఆ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం.. ఒక ఉద్యోగం: సీఎం జగన్‌ | CM Jagan Review Meeting With Flood Affected District Officials | Sakshi
Sakshi News home page

HeavyRains, Floods: వారికి వెంటనే కొత్త ఇల్లు మంజూరు చేయండి

Published Mon, Nov 22 2021 10:05 AM | Last Updated on Mon, Nov 22 2021 11:36 AM

CM Jagan Review Meeting With Flood Affected District Officials - Sakshi

సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ..
వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండండి
వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించండి
తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించండి
25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు ఇవ్వాలి
గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలి
వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలి
ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలి


ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదు
సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించండి
వారికి అందించే సేవల్లో ఎక్కడా లోటు రానీయకూడదు
ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలి
వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలి
విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలి, దీనికిమీద ప్రత్యేక దృషిపెట్టాలి
104 కాల్‌సెంటర్‌ ఇప్పటికే ప్రజలందరికీ పరిచయం ఉంది
ఈ నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించండి
వదరలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా.. ఈనంబర్‌కు సమాచారం ఇవ్వమని చెప్పండి
104కు ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే అధికారులు స్పందించి... బాధితులకు తోడుగా నిలవాలి
జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారిని నియమించండి
పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టండి
ఎక్కడ అవసరమవుతుందో.. అక్కడ పెట్టండి, ఒక డ్రైవ్‌లా చేయండి
రోడ్లను పునరుద్ధరించడంపై దృష్టిపెట్టండి
రవాణా సాగేలా ముందు తాత్కాలిక పనులు వెంటనే చేయాలి
శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలి
ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలి
వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి.. పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి


పంచాయతీరాజ్, మున్సిపల్‌ విభాగాలు దీనిపై చర్యలు తీసుకోవాలి
ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే నగదు ఇవ్వండి
పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వండి
దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరుచేయండి
దీనివల్ల వెంటనే పనులు మొదలుపెట్టగలుగుతారు
పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలి
ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారు
మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలి
చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవండి
నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండండివారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోండిఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండండి. రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించండి
విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి... మిగిలిన వారిలో ధైర్యం నింపాడానికే ఈ చర్యలు
వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి
మరణించిన పశువుల కళేబరాలవల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోండి:
పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టండి
వాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోండి
పంటల నష్టం ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టండి
విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయండి
చెరువులు, ఇతర జలాశయాలు, గట్టుమీద దృష్టిపెట్టండి
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
ఎప్పటికప్పుడు వారు నివేదికలను అధికారులకు అందించాలి
బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తున్నారుఅయినా సరే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండండి
కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నాం
అధికారులు అంతా డైనమిక్‌గా పనిచేయాలి
ఎలాంటి సమస్య ఉన్నా.. నా దృష్టికి తీసుకు రండి
విద్యుత్‌ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు
సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోండి
వరద ముంపును పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా సంబంధించి సబ్‌స్టేషన్లను, కరెంటు సరఫరా వ్యవస్థను ముంపు లేని ప్రాంతాలకు తరలించాలి
పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశాం
పశువులు మరణిస్తే.. నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోండి
గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి

కాగా, ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. జిల్లాకో సీనియర్‌ అధికారిని నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ కమిషనర్‌ కె కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement