సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఆయన.. నాలుగు గంటల సమయంలో ఢిల్లీకి చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సహా.. పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, తాజా పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిసింది. ఏపీ అభివృద్ధి అజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగుతుంది. (చదవండి: సీఎం ఆదేశం: వారిపై కేసులు ఎత్తివేత)
ఆయన రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment