AP CM YS Jagan Holds Review Meeting On Department of Housing At Tadepalli - Sakshi
Sakshi News home page

CM YS Jagan Review Meeting: గృహ నిర్మాణశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Published Mon, Apr 18 2022 4:21 PM | Last Updated on Mon, Apr 18 2022 8:06 PM

CM YS Jagan Holds Review on Department of Housing at Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశంలో ఎనర్జీ, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఎనర్జీ సెక్రటరీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హౌసింగ్‌పై సమీక్షలో ముఖ్యాంశాలు..
ఇళ్లపట్టాలు కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గడచిన ఆర్థిక సంవత్సంలో సుమారు రూ.3,600 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం ఖర్చు చేయనున్న ప్రభుత్వం.
ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్‌టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్న ప్రభుత్వం.

సమీక్షలో సీఎం ఏమన్నారంటే..
కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దంచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. 
కేసులు పరిష్కారం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నచోట.. ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టాలన్న ముఖ్యమంత్రి. 
ఇందులో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 కోర్టు వివాదాలు తీరడంతో విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం. 
విశాఖలో పట్టాల పంపిణీ పూర్తికాగానే, వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు జూన్‌నాటికి ప్రారంభం అవుతాయన్న అధికారులు.
దాదాపు 63 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణంకోసం సమాయత్తమవుతున్న ప్రభుత్వం.
ఇక్కడ భూమిని చదును చేయడంతోపాటు, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీళ్లు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం. 

5వేలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నచోట నిర్మాణ సామగ్రిని ఉంచడానికి వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించిన అధికారులు.
66 గోడౌన్లలో 47 గోడౌన్ల నిర్మాణం ప్రారంభమయ్యిందన్న అధికారులు.

ఇళ్లకు ఇచ్చే కరెంటు సామగ్రి అత్యంత నాణ్యతతో ఉండాలన్న సీఎం. 
బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అన్నీకూడా నాణ్యతతో ఉండాలన్న సీఎం.
నాణ్యతలేని పరికరాలు కొంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన సీఎం. 
నాణ్యతా ప్రమాణాలు ఉన్నవాటినే కొనుగోలు చేయాలని అధికారులుకు స్పష్టం చేసిన సీఎం.

పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని నిర్ణయం. 
వారు చురుగ్గా వ్యవహరిస్తున్నచోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని వెల్లడించిన అధికారులు.
ఇలాంటి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలని నిర్ణయం.
మండలానికి ఒక సర్పంచ్‌ని, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇవ్వాలని నిర్ణయం.

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించిన సీఎం. 
దీని తర్వాత కాలనీలకు కావాల్సిన సామాజిక, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు సాగాలన్న సీఎం. 
కాలనీల్లో సమగ్ర ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టుకుంటూ ముందుకు సాగాలన్న సీఎం. 
దీనికి సంబంధించిన విభాగాలన్నీ అత్యంత సమన్వయంతో ముందుకు సాగాలన్న సీఎం. 
భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి ఇది బృహత్తర ప్రణాళిక అనీ, జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామన్న సీఎం

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సమీక్షించిన సీఎం
ఇప్పటివరకూ పథకాన్ని వినియోగించుకున్న 10.2 లక్షలమంది, 6.15 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ పూర్తి.
మిగిలినవారికీ వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని సీఎం ఆదేశం. 
ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మంది ముందుకు వస్తారన్న ముఖ్యమంత్రి. 
టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. 
టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
దీనికోసం మార్గదర్శకాలు తయారుచేయాలన్న సీఎం. 

ఎంఐజీ ప్లాట్ల పథకంపైనా సీఎం సమీక్ష
పట్టణాలు, నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి.
మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎంఐజీ ఇళ్ల పథకంకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. 
ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాల భూములను గుర్తించామని తెలిపిన అధికారులు.
వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్‌ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు ఇస్తామన్న సీఎం.
మౌలిక సదుపాయాలకోసం లే అవుట్‌లో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తామన్న సీఎం. 
ప్రతి నియోజకవర్గంలోకూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి.
ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లేవుట్‌ ఉండాలన్న సీఎం. 

చదవండి: (విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement