సీఎం జగన్‌కు వినతి పత్రం అందిస్తున్న బాలకృష్ణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు గ్రామంలో జక్కంపూడి గణేశ్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి న సీఎం వైఎస్ జగన్‌కు పలువురు తమ సమస్యలు తెలియజేశారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశించిన మూడు గంటల్లోనే కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొత్తం ఆరుగురు అర్జీదారులకు రూ.5.50 లక్షల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ మాధవీలత అందించారు.
ధవళేశ్వరానికి చెందిన ఆర్‌జీ బాలకృష్ణ డిసెంబర్‌లో మలేసియాలో జరిగే వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు వెళ్లేందుకు ప్రయాణఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షల చెక్కు అందజేసినట్లు తెలిపారు. అలాగే వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అన్నవరానికి చెందిన పెయ్యాల బాబురావుకు రూ.లక్ష, రాపాక వెంకట సూర్యనారాయణకు రూ.25 వేలు, వాడపల్లికి చెందిన దాకే చంద్ర ఫణికుమార్‌కి రూ.లక్ష, పోతవరానికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్‌కు రూ.25 వేలు చెక్కు అందజేశామన్నారు.
తండ్రిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పెనుగొండకు చెందిన కె.లక్ష్మీకుమారికి రూ.50 వేలు చెక్కు అందజేయడంతో పాటు ఉద్యోగం కోసం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు తెలిపారు. పోతవరానికి చెందిన తోట ఇంద్రకుమారి ఇంటి స్థలం పట్టా కోసం సీఎంను కలిశారని.. ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment