భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Orders Collectors To Be Vigilant In Heavy Rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

Published Thu, Jul 22 2021 3:10 PM | Last Updated on Thu, Jul 22 2021 3:31 PM

CM YS Jagan Orders Collectors To Be Vigilant In Heavy Rains - Sakshi

సాక్షి, అమరావతి: భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement