
సాక్షి, అమరావతి: తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘గ్రాంథికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని, పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి గారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యులకందించిన గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే’ అని పేర్కొన్నారు.
నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు
సినీ హీరో అక్కినేని నాగార్జునకు సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యంత ప్రశంసనీయమైన నటుల్లో ఒకరైన నాగార్జునకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment