Breadcrumb
- HOME
వైఎస్సార్ రైతు భరోసా.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
Published Mon, May 16 2022 9:36 AM | Last Updated on Mon, May 16 2022 4:34 PM
Live Updates
వైఎస్సార్ రైతు భరోసా.. నాలుగో ఏడాది తొలి విడత సాయం
రైతుల ఖాతాల్లో నగదు జమ..
వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది.
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.
గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను గమనించండి: సీఎం జగన్
ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని సీఎం జగన్ మండిపడ్డారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలి. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?. మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా?. రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నాం. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్ట చతుష్టయం ప్రశ్నించలేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?.
ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నాం. గతానికి, ఇప్పటికి ఉన్న తేడాను రైతులు గమనించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కొల్లేరులో రీ సర్వేకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్
మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు. మన ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లు. రైతులకు మంచి చేయాలని మనసుతో ఆలోచించే ప్రభుత్వమిది. ఏ పంట సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్నాం.
చంద్రబాబు దత్తపుత్రుడు పరామర్శకు బయల్దేరాడు. పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమ చూపించాడు. నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు. రైతుకు ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు చంద్రబాబు. రైతులపై కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబు. రుణాల పేరుతో మోసం చేసిన నాయుకుడి పాలనను గుర్తుచేసుకోవాలని’’ సీఎం జగన్ అన్నారు.
ఎన్నడూ లేని విధంగా..
రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని సీఎం జగన్ అన్నారు. మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో మిగిలిన రూ.2వేలు చొప్పున జమ చేస్తుమన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు జమ చేశామన్నారు. ఎన్నడూలేని విధంగా మూడేళ్లలో రైతులకు లక్షా 10వేల కోట్లు ఇచ్చామన్నారు. ఈ రోజు రూ.5,500 నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం అన్నారు.
ఖరీఫ్ పనులు మొదలు కాక మునుపే రైతు భరోసా: సీఎం జగన్
ఖరీఫ్ పనులు మొదలు కాక మునుపే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేలండర్ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామన్నారు.
ఈ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది: మంత్రి కాకాణి
వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా కింద 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దక్కుతుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి.. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ముంగిటకే ఎరువులు, విత్తనాలు వంటి సంబంధిత సేవలను తీసుకొచ్చారన్నారు.
రైతుల కళ్లలో సంతోషం: ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు
రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ గణపవరం ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన విత్తనాలు నుంచి అమ్మకాల వరకు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.
లైవ్ వీడియో
స్టాల్స్‌ను సందర్శించిన సీఎం జగన్
రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించారు. వ్యవసాయ పంటలు, దిగుబడులు గురించి ముఖ్యమంత్రికి రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.
గణపవరంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
గణపవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
గణపవరం చేరుకున్న సీఎం జగన్
ఏలూరు జిల్లా గణపవరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, విశ్వరూప్ ఉన్నారు. నాలుగో ఏడాది మొదటి విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లలో సీఎం జమ చేయనున్నారు.
గణపవరం బయలుదేరిన సీఎం జగన్
ఏలూరు జిల్లా గణపవరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, విశ్వరూప్ ఉన్నారు. నాలుగో ఏడాది మొదటి విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లలో సీఎం జమ చేయనున్నారు.
కాసేపట్లో నాలుగో ఏడాది తొలి విడత సాయం
ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కాకముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.
ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం
ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మే లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేశారు.
బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్న సీఎం
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సోమవారం ఉదయం 10.10 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.
రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం..
వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది.
రైతు భరోసా సాయం విడుదలకు అంతా సిద్ధం
ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కాకముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
Related News By Category
Related News By Tags
-
సాగును బాగు చేశాం
సాక్షి, అమరావతి: ‘సచివాలయాలు, ఆర్బీకేలు లాంటి గొప్ప వ్యవస్థల ఏర్పాటుతో గ్రామ స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తెచ్చి రైతులకు తోడుగా నిలిచాం. వారికి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్...
-
మాటకు మించి సాయం
సాక్షి, అమరావతి: అన్నదాతల కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ప్రతి అడుగూ రైతులు, రైతు కూలీలు బాగుండాలని మనసా వాచా కర్మణా వేస్తూ వచ్చామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుం...
-
అన్నదాతలను ఆదుకున్నాం
రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చదువుకొనే పిల్లలు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వారి గుండెల్లో ఎంతగా స్థానం ఇస్తారని చెప్పడానికి ఒక వైఎస్సార్, ...
-
రేపు రైతన్నలకు ‘రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 7వతేదీన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కా...
-
కరువు నేలకు.. ‘కృష్ణా’భిషేకం
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పశ్చిమ మండలాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఏ.రామగోపాలరెడ్డి: రాష్ట్రంలో అత్యంత కరువు పరిస్థితులకు, వలసలకు మరుపేరైన కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పశ్చిమ మండలాలు కృష్ణమ...
Comments
Please login to add a commentAdd a comment