సాక్షి, అమరావతి: వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని అధికారులు తెలిపారు.
చదవండి: Andhra Pradesh: 60 ఏళ్లకు కదలిక
►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం
►ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయన్న అధికారులు
►పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు
►డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్న అధికారులు
►అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు
►వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం
►సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు
►అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామన్న అధికారులు
►మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం
16 కొత్త మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతినీ సమీక్షించిన సీఎం
►ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు
►కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు
►వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు
►ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్ష
గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు:
♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059
♦2019 జూన్ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెంపు
♦2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1717 ఆస్పత్రులకు పెంపు.
♦కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి
♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3300 మందికి లబ్ధి.
♦బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు.
♦ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు.
♦ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లింపు
♦శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225లు ఇస్తున్న ప్రభుత్వం.
♦కాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం.
వైఎస్సార్ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష
♦ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం
♦కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం
♦కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు
♦దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం
♦ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు
♦60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు
♦ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్న అధికారులు
♦కోవిడ్ పరిస్థితులు కారణంగా కంటివెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయన్న అధికారులు.
♦కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్న సీఎం.
హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష
♦వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం
♦జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్
♦మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్
♦ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు
♦జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్
కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు
♦మొత్తం పాజిటివ్ కేసులు 3366
♦పాజిటివిటీ రేటు 0.7 శాతం
♦పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12
♦పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
♦2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1
♦అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457
♦అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311
♦ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లు మొత్తం 140
♦15 డిసెంబరు నాటికి పీఏస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు
వ్యాక్సినేషన్
♦సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,17,71,458
♦రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482
♦మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940
♦మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జిఎస్ నవీన్‌కుమార్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment