
సాక్షి, అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్ధి డా. గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి.
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలి. తిరుపతిలో వచ్చిన మెజార్టీ ఒక మెసేజ్‌గా ఉండాలి. మహిళా సాధికారత, మహిళలకు జరిగిన మేలును కూడా తెలపాలి. ప్రతి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా మంత్రి, ఎమ్మెల్యే అదనంగా ఉంటారు. సమన్వయంతో పనిచేసి డా. గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలి’’ అని పిలుపునిచ్చారు.