సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సీఎంకు అధికారులు వివరాలు అందించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై సీఎం సమీక్షించారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్ సెంటర్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
చదవండి: కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:
♦మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
♦పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
♦తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్న సీఎం
♦ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న సీఎం
ఎక్సైజ్ శాఖపైనా సీఎం సమీక్ష.
♦అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్న సీఎం
♦బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర
♦దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ రూపొందించాలి
♦అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలన్న సీఎం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపైనా సమీక్ష
♦సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్న సీఎం
♦సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న అధికారులు
♦సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్ పెట్టాలన్న సీఎం
♦14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశం
♦ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ఈ నెంబరుపోస్టర్‌ను డిస్‌ప్లే చేయాలని ఆదేశం
♦ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నెంబరు డిస్‌ప్లే చేయాలి
♦పటిష్టమైన చర్యలు ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్న సీఎం
♦14400 ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టుపై కూడా పక్కాగా ఉండాలన్న సీఎం
♦గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో డిస్‌ప్లే చేయాలన్న సీఎం
♦రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్న సీఎం
♦అప్పుడే ప్రజలు ముందుకు వస్తారన్న సీఎం
♦51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయన్న అధికారులు
♦మరో 650 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు
♦వీటికి అదనంగా 2వేల గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం అక్టోబరు2, 2022 నాటికి సిద్ధం చేస్తామన్న అధికారులు
♦రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎం
అటవీ పర్యావరణ శాఖపైనా సీఎం సమీక్ష
♦త్వరలోనే రెడ్ శాండిల్ ఆక్షన్– గ్లోబల్ టెండర్ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయన్న అధికారులు.
♦ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్న సీఎం
♦ప్రతి నెలా స్టాక్‌కు సంబంధించిన వివరాలు చెక్ చేసుకుంటూ... వివరాలు నమోదు చేయాలన్న సీఎం
♦పక్కాగా స్టాక్ వెరిఫికేషన్ చేయాలన్న సీఎం
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపైనా సమీక్ష
♦గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు రూ.905.57 కోట్ల డబ్బును చెల్లించిందన్న సీఎం
♦అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలన్న ముఖ్యమంత్రి
ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి(ఎక్సైజ్ శాఖ) కె నారాయణస్వామి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ (ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్) స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జి సాయి ప్రసాదరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ఏపీ జెన్‌కో ఎండీ బి శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment