CM YS Jagan Review of Revenue Departments - Sakshi
Sakshi News home page

ఆదాయార్జన శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి: సీఎం జగన్‌

Published Fri, Apr 21 2023 4:44 PM | Last Updated on Fri, Apr 21 2023 4:59 PM

CM YS Jagan Review Of Revenue departments - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆదాయార్జన శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సీఎం జగన్‌ శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్‌ సీఎస్‌లు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రజత్‌ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్‌ వై. మధుసుదన్‌రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్‌ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌ రామకృష్ణ, సేల్స్‌ టాక్స్‌ స్పెషల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్, అడిషనల్‌ డీజీలు ఎన్‌.సంజయ్, రవిశంకర్‌ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్‌ డైరెక్టర్‌ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

  • ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి
  • దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులుచెల్లించేవారికి సౌలభ్యంగా సేవలు అందుతాయి.. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • వీటిని అధ్యయనం చేసి వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలన్న సీఎం
  • ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎం జగన్‌కు వివరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించిన అధికారులు
  • గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు.
  • కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ
  • గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి
  • 2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా వెల్లడించిన అధికారులు. 
  • ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు. 
  • లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించిన అధికారులు. 
  • సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతలపట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నామన్న అధికారులు. 
  • యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. వీటిపై దృష్టిపెట్టాలన్న సీఎం. 

  • స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది చెందినట్టుగా తెలిపిన అధికారులు
  •  గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం
  • 2018-19లో ఈ శాఖ ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు చేరిన ఆదాయం
  •  రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్‌ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్లకూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  •  సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలన్న సీఎం
  •  ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ఉంచాలన్న సీఎం.
  •  మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి వాటిని అమల్లోకి తీసుకురావడంపై దృష్టిపెట్టాలన్న సీఎం. 
  • వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశం. 
  • అవినీతి నిరోధకశాఖను క్రియాశీలకంగా ఉంచాలని సీఎం ఆదేశం.
  • డ్రగ్స్, మత్తుపదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
  • యూనివర్శిటీలు, కాలేజీలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్‌ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ఉంచాలన్న సీఎం.
  •  డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్‌ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్‌ చేపట్టాలన్న సీఎం. 

  • గనులు ఖనిజాల శాఖలో 2022-23 సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యం కాగా, రూ. 4,756 కోట్ల ఆదాయం.
  •  గత ఏడాదితో పోలిస్తే 26శాతం వృద్ధి.
  •  ఈ ఏడాది రూ.6వేలకోట్ల మేర ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నామన్న అధికారులు.
  • రవాణాశాఖలో 2022-23లో ఆదాయం రూ. 4294.12 కోట్లు.  95.42శాతం లక్ష్యాన్ని చేరుకున్న రవాణా శాఖ
  •  2018-19లో ఈ ఆదాయం రూ. 3224.98 కోట్లు.
  •  ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) లో రూ.6999.42 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు.
  •  రవాణాశాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్న సీఎం. 
  •  దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీఎం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement