సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఏపీ డి...
సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ వద్�...
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్ల�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అ�...
పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్�...
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్స�...
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళ�...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్�...
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంత...
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రక...
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక�...
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబో�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ము�...
Published Thu, Jun 23 2022 10:26 AM | Last Updated on Thu, Jun 23 2022 9:17 PM
తిరుపతి పర్యటనలో సీఎం జగన్
రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీసీఎల్ ద్వారా 2వేల మందికి, ఫాక్స్ లింగ్ ద్వారా 2 వేల మందికి, సన్నీ ఆప్కోటెక్ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ అన్నారు.
తిరుపతి: సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్.. సన్నీ ఆప్కోటెక్ తయారు చేస్తోంది. వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాలను ఆ సంస్థ సరఫరా చేయనుంది. రూ.254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయగా, 3వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుంది.
శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులో వస్తుంది. 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయి' అని తెలిపారు.
ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన.
అపాచీ పరిశ్రమలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులు.
మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడి.
అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం 15 వేల మందికి ఉపాధి.
వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న సీఎం జగన్
వకుళామాత ఆలయ ఆవరణలో మొక్కనాటిన సీఎం జగన్. తిరుపతిలో వకుళామాత ఆలయాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్. సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు.
తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో సీఎం జగన్. శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొననున్న సీఎం జగన్.
పూర్ణాహుతిలో పాల్గొని వకుళామాతను తొలి దర్శనం చేసుకోనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రార్డె, జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.
తిరుపతి రూరల్ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొంటారు. పలు పరిశ్రమ యూనిట్ల నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటన లో భాగంగా పలు పరిశ్రమలు ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి లోని ఇలగనూరులో అపాచి పాదరక్షలు తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి జిల్లా పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరిన సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment