vakulamata temple
-
వకుళమాత ఆలయం అద్భుతం.. మహాసంప్రోక్షణ క్రతువులో సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ క్రతువును వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై ఉన్న ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా నిర్వహించిన మహా సంప్రోక్షణ కైంకర్యాది కార్యక్రమంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. 900 ఏళ్ల చరిత్ర కలిగి, 350 ఏళ్ల పాటు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో జీర్ణోద్ధరణ చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలో జరుగుతున్న మహా సంప్రోక్షణలో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని పరిమళ పుష్కరిణిలో నీటిని సీఎం తలపై చల్లుకున్నారు. కోనేరు వద్ద టీటీడీ అధికారిక వృక్షం అయిన మానుసంపంగి మొక్కను నాటారు. అనంతరం సీఎంకు టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్య అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ గోపురం ముందు ఉన్న స్వామి వారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఆలయ మహా సంప్రోక్షణకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. మంగళ వాయిద్యాల నడుమ సీఎం ఆలయంలోకి ప్రవేశించారు. మరింత అభివృద్ధికి తోడ్పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శ్రీవకుళమాత అమ్మవారి తొలి దర్శన భాగ్యాన్ని అందుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో గోవింద నామస్మరణ మధ్య కాసేపు గర్భాలయంలో ఉండిపోయారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి చతుర్వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సీఎంకు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన శ్రీవకుళమాత ఫొటో ఫ్రేమ్‌ను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడుతూ.. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. అనంతరం విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అమ్మవారు వెలసిన కొండపై నలుదిక్కులా కలియదిరిగారు. ఉత్తరం వైపు ఉన్న సప్తగిరుల వైపు చూస్తూ.. కలియుగ వైకుంఠనాథుడికి ముకుళిత హస్తాలతో నమస్కరించారు. దివ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. నాటి వైభవం సాక్షాత్కరించేలా ఆలయాన్ని తీర్చిదిద్దడంలో కృషి చేసిన స్థపతి సూరిబాబు, దారుశిల్పి మహేష్, స్వర్ణకారులు శ్రీనివాస్‌లను సీఎం సత్కరించారు. వారికి స్వర్ణ కంకణాలను బహూకరించారు. అమ్మవారి విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి ప్రసాద్, ఆలయంలో మెటల్ వర్క్‌ను అద్భుతంగా చేసిన సారథిలను దుశ్శాలువతో సత్కరించారు. తమిళ శాసనం అద్భుతమే ఆలయ చారిత్రక నేపథ్యాన్ని తెలియజేసే క్రీ.శ. 1198 నాటి తమిళ శాసనం బయటపడటం అద్భుతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఆలయం ముందున్న శాసనాన్ని మంత్రి పెద్దిరెడ్డి సీఎంకు చూపించి, చరిత్రను వివరించారు. పురావస్తు శాఖ ద్వారా తర్జుమా చేసిన వివరాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. శాసనాన్ని జాగ్రత్తగా కాపాడాలని టీటీడీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మలికార్జునరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, వెంకటేశ్‌గౌడ, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ప్రశాంతిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
వకుళామాత ఆలయంలో సీఎం జగన్
-
సీఎం జగన్ తిరుపతి పర్యటన సాగిందిలా..
-
వకుళమాతకు పూర్వవైభవం
-
ఆధ్యాత్మిక క్షేత్రానికి పారిశ్రామిక శోభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుపతి జిల్లా పారిశ్రామిక కాంతులతో విరాజిల్లనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత ఆలయం మహాసంప్రోక్షణ క్రతువులో పాల్గొనేందుకు గురువారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బంగారు వకుళమాత ఆలయం తిరుపతి సమీపంలోని పేరూరు కొండపై 900 ఏళ్ల చరిత్ర కలిగిన వకుళమాత ఆలయం ఉంది. సుమారు 350 ఏళ్ల క్రితం మహమ్మదీయుల దండయాత్రల్లో దెబ్బతిన్న ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ చూపి దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చి టీటీడీని ఒప్పించి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వపరంగా సీఎం పూర్తి సహకారం అందించారు. ఆలయానికి 83.41ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి టీటీడీకి అప్పగించారు. వకుళమాత ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సంకల్పించి 42 కిలోల బంగారంతో ఆర్నెల్లలోనే ఆలయ గోపురాన్ని స్వర్ణమయం చేశారు. సొంత నిధులతో అమ్మవారికి బంగారు అభరణాలు, కనకపు కవచాలను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చేయించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా బంగారు ఆభరణాలను టీటీడీకి అందించనున్నారు. 3 భారీ పరిశ్రమలు.. 4,550 మందికి ఉపాధి తిరుపతి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రేణిగుంట మండలం జీపాళ్యెం, ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలో టీసీఎల్‌కి అనుబంధంగా రూ.1,702 కోట్లతో ఏర్పాటవుతున్న ప్యానల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ సంస్థ, సెవెన్ హిల్స్ డిజిటల్ పార్కులో సన్నీ ఓపోటెక్ ఇండియా సంస్థ రూ.350 కోట్లతో నెలకొల్పే ప్రాజెక్టు, ఇదే పార్క్‌లో ఫాక్స్‌లింక్ ఇండియా ఎలక్ట్రిక్ రూ.355 కోట్లతో నెలకొల్పే భారీ ప్రాజెక్టులను సీఎం జగన్ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తంగా రూ.2,407 కోట్లతో 4,550 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా ఏర్పేడు–వెంకటగిరి రహదారిలో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద 125 ఎకరాల్లో అపాచీ నెలకొల్పుతున్న పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఫాక్స్‌లింక్ ఇండియా ఎలక్ట్రిక్ సంస్థ చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టు, డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన టీవీ యూనిట్ పనులకు కూడా సీఎం భూమి పూజ నిర్వహిస్తారు. -
CM Jagan: 23న తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి రూరల్ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొంటారు. పలు పరిశ్రమ యూనిట్ల నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన వివరాలు.. సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకుంటారు. 11.15 నుంచి 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ–1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్
-
కాంతుల వెలుగులో వకుళమాత ఆలయం
-
వకుళమాత సంప్రోక్షణలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
వకుళమాత ఆలయానికి పూర్వవైభవం
తిరుపతి రూరల్: వందల ఏళ్ల పాటు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన దివ్యక్షేత్రం. పవిత్ర పుష్కరిణి ఓ వైపు.. దప్పిక తీర్చే నారదతీర్థం మరోవైపు. తిరుమలకు నడిచి వెళ్లే ఎందరో భక్తులకు ఆశ్రయం కల్పించి, మరెందరో నిరాశ్రయుల ఆకలి తీర్చిన దివ్యధామం. అది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం. ఆ ఆలయంలో గంట కొడితేనే తిరుమలలోని కన్నబిడ్డకు నైవేద్యం పెట్టేవారని ప్రతీతి. తిరుపతికి 5 కిలో మీటర్ల దూరంలో పేరూరు బండపై ఉన్న ఈ ఆలయం సుమారు 320 ఏళ్ల క్రితం మైసూరు పాలకుడు హైదర్ అలీ దండయాత్రల్లో దెబ్బతింది. విగ్రహం మాయమైంది. ఆలయం చుట్టూ ఉన్న కొండను ఏళ్ల పాటు మైనింగ్ మాఫియా కరిగించింది. వందల ఏళ్ల పాటు ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోక, కనీసం భక్తులు దర్శించుకునేందుకు మెట్లు కూడా లేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఆలయం ఇప్పుడు పూర్వవైభవాన్ని సంతరించుకుంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంకల్పం ఫలించింది. సర్వాంగ సుందరమైన దివ్యక్షేత్రంగా ఆలయం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆలయ మహాసంప్రోక్షణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న ఆలయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇదీ చరిత్ర.. వకుళమాత ఆలయ నిర్మాణ శైలి పూర్తిగా తిరుమల తరహాలోనే ఉండటం విశేషం. అక్కడి అద్భుతమైన శిల్ప కళా వైభవం, అబ్బురపరిచే నిర్మాణ కౌశలం చూపరులను కట్టిపడేస్తుంది. గతంలో ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని చెబుతారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. ఈ ఆలయంతో పాటు తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలనీ హైదర్ అలీ హుకుం జారీ చేశాడు. ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం మాత్రం పాడుకాలేదు. కానీ విగ్రహాన్ని మాత్రం ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేదు. ఆ ఆలయం ఆమెది కాదని 2019 వరకూ మైనింగ్ మాఫియా వాదించింది. అయితే.. పేరూరు కొండపైన క్రీ.శ.1198 నాటికే ఆలయం ఉండేదనే చారిత్రకాధారం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పనుల్లో భాగంగా 2019లో ఆలయం ఎదుట మట్టిని తొలగిస్తున్నపుడు తమిళ అక్షరాలతో ఓ శిలాశాసనం కనిపించింది. భారత పురావస్తుశాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నంరెడ్డి ఆధ్వర్యంలో ఈశాసనాన్ని అధ్యయనం చేశారు. క్రీ.శ.1198లో చోళరాజులు వేసిన తమిళ శాసనంగా దానిని నిర్ధారించారు. చోళరాజ్యంలో సామంతుగా రెండవ వీరభల్లాలుడు క్రీ.శ.1173 నుంచి క్రీ.శ. 1220 వరకు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తిరుపతికి సమీపంలోని యోగిమల్లవరం పురాతన శివాలయంలో లభించిన శాసనాల ద్వారా ఆధారాలు ఉన్నాయి. అప్పటికే ఈ ఆలయం నిర్మితమై ఉందని ఈ శాసన సారాంశం. దీంతో ఆలయం ప్రాచీనత మీద నడిచిన వివాదానికి తెరపడినట్లయింది. పరిపూర్ణానంద స్వామి పోరాటంతో.. వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ కోసం కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. న్యాయస్థానంలో కేసులు వేయించి అనుకూల తీర్పును సాధించారు. టీటీడీనే వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేయాలని కోర్టులు సైతం తీర్పు ఇచ్చాయి. స్వామి పోరాటానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజకీయ నేతలు, అధికారులు సైతం తోడ్పాటు అందించారు. దీంతో టీటీడీ నిధులు మంజూరు చేసి ఆలయానికి చేరుకునేందుకు ఇనుప మెట్లను, గుడి వద్ద చిన్న, చిన్న పనులు చేయించింది. సొంత నిధులిచ్చిన పెద్దిరెడ్డి.. తిరుచానూరులోని అలివేలు మంగాపురం తరహాలో దివ్యక్షేత్రంగా వకుళమాత ఆలయాన్ని తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం, టీటీడీ అధికారులతో కలిసి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. సొంత నిధులతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసేందుకు పెద్దిరెడ్డి ముందుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను తన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డితో కలసి ఆలయ పూర్వాపరాలను పెద్దిరెడ్డి వివరించారు. సీఎం దిశానిర్దేశం, పెద్దిరెడ్డి చొరవతో ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా పనుల రూపకల్పన జరిగింది. దీంతో కేవలం 4 ఎకరాలకే పరిమితమైన ఆలయాన్ని 83.41 ఎకరాలకు విస్తరించారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. నాటి శిల్పకళావైభవం చెక్కుచెదరకుండా గుడి గోడలను బలోపేతం చేశారు. గోపురాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గర్భగుడికి బంగారంతో తాపడం చేయించారు. నాడు శిథిలమైన గోడలతో నిండిన ఈ ఆలయ గర్భగుడి నేడు సుదూర ప్రాంతాలకు సైతం తన స్వర్ణకాంతులను ప్రసరింపజేస్తోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం తర్వాత బంగారు తాపడం చేసిన గర్భగుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మంత్రి పెద్దిరెడ్డి సొంత నిధులతో ఈ ఆలయాన్ని బంగారు తాపడం చేయించారు. ఆలయం వద్ద కళ్యాణాలు చేసుకునేందుకు వీలుగా మండపాలు నిర్మిస్తున్నారు. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వైదిక సంస్కారాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమళ పుష్కరిణికి పునరుజ్జీవం నింపారు. ఆలయానికి ఈశాన్యంలో నూతనంగా పుష్కరిణిని నిర్మించారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయరహదారి నుంచి ఆలయం వరకు సెంట్రల్ లైటింగ్‌తో అందమైన సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం చుట్టు పక్కల పచ్చదనం నింపేందుకు దేశ, విదేశాల నుంచి తెప్పించిన మొక్కలతో వనాలను పెంచుతున్నారు. కొండను చేరుకునేందుకు ఘాట్‌రోడ్డును నిర్మించారు. ఈ ఆలయాన్ని ఈనెల 23న ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రాకకు వీలుగా ఆలయానికి సమీపంలోని సి.మల్లవరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం వకుళమాత ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించాం. వందల ఏళ్లుగా ఈ ఆలయం జీర్ణోద్ధరణకు నోచుకోక పాడుబడింది. ఈ విషయమై గడిచిన 45 సంవత్సరాలుగా టీటీడీ అనేక కోర్టుల్లో పోరాటం చేసి విజయం సాధించింది. గతంలో తిరుమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చినపుడు ఆలయ చరిత్రను ఆయనకు వివరించి, పునఃనిర్మిస్తామని చెప్పాం. ఆలయ నిర్మాణ బాధ్యతలు నాకు అప్పగిస్తూ.. నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. ఆ మేరకు అత్యద్భుతమైన నిర్మాణం సాధ్యమైంది. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 83.41 ఎకరాల భూమిని సమకూర్చాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి -
అమ్మకు ఆలయం
పరిస్థితుల ప్రభావానికి, కాలగతికి ఎవరూ, ఏమీ అతీతులు కారనడానికి రూపురేఖలు కోల్పోయి, ఓనాటి వైభవానికి నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయమే నిదర్శనం. కోట్లకు అధిపతి అయిన బిడ్డ ప్రపంచంలోనే అతి సంపన్న దేవుడిగా ఎదిగినా, తల్లి మాత్రం పూరిగుడిసెలో ఉంటుందనటానికి ఉదాహరణ ఆ ఆలయం. శతాబ్దాల తరబడి ధూప, దీప నైవేద్యాలకు, కనీసం భక్తులు దర్శించుకునేందుకు, ఆలన పాలనకు నోచుకోని దుస్థితిలో ఉన్న ఆలయం ఎవరిదో అనే కదా మీ సంశయం. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి తల్లి వకుళామాత ఆలయం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో పేరూరు బండపై ఉన్న ఈ ఆలయానికి పూర్వవైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బిడ్డ కోసం నాలుగు యుగాల నిరీక్షణ.... దేవతల తల్లి అదితి విష్ణుమూర్తి తన కొడుకుగా కావాలని తలంచింది. తన భర్తౖయెన కశ్యప ప్రజాపతితో కలిసి వేల సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి వామనావతారంగా అదితిదేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడు. పుట్టడంతోనే ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగుతో ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లవాడిగా పుట్టి బలి చక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్లనారంభించాడు. కన్నకొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి ‘పుట్టడంతోనే అలా వెళ్లిపోయావు, కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు. ఇదేనా నా తపఃఫలితం’ అని బాధపడింది. దీంతో ‘అమ్మా... అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తా’ అని వామనుడు మాట ఇచ్చాడు. త్రేతాయుగంలో రామావతారంలో అదితి, శబరిగా కనిపిస్తుంది. క్రితం జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురు చూస్తుంది. రాముడు శబరి మాత ఇచ్చిన పళ్లు తిని మాట నిలబెట్టుకుంటాడు. మళ్లీ శబరి బాధతో ‘కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా ఉండవా...’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రాముడు ‘తల్లీ, నీ కోరిక ద్వాపరయుగంలో తీరుస్తాను’ అంటూ బయలుదేరుతాడు. ద్వాపర యుగంలో అదితి, యశోదగా పునర్జన్మనెత్తుతుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంత కాలం దూరంగా ఉన్నా తిరిగి తన దగ్గరకే వచ్చారు శ్రీకృష్ణుల వారు. కానీ ఇంకా తన మనస్సులో వెలితి మాత్రం మిగిలిపోయింది. అష్టభార్యలను కట్టుకున్నా, అవేమీ తన సమక్షంలో జరగలేదన్న తల్లి పడుతున్న బాధను గమనించిన కృష్ణుడు ఆమె కోరికను కలియుగంలో తీరుస్తానని మాటిస్తాడు. కలియుగంలో వెంకటేశ్వరస్వామిగా అవతారం ఎత్తిన సమయంలో వకుళాదేవిగా జన్మిస్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తన ఆధ్వర్యంలో జరిపించి యుగ యుగాల తన కోరిక తీర్చుకుంది. పేరూరు కొండపై ఆలయం.. మన పూర్వీకులు నిర్మించిన...ప్రతిష్ట కలిగిన ఆలయాలన్నీ దాదాపు కొండపైనే ఉంటాయి. వకుళమాత ఆలయం కూడా పేరూరు కొండపైనే ఉంది. ఈ ఆలయం నిర్మాణం 500 ఏళ్ల క్రితం శ్రీ కృష్ణదేవరాయల కాలంలో జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. 50 ఎకరాల్లో ఈ కొండ విస్తరించి ఉంది. ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని పేర్కొంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులు ఇక్కడ సేదతీరి, అన్నం తిని, నిద్రచేసి కొండకు వెళ్లేవారని చెబుతుంటారు. నాడు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఆ ఆలయం హైదర్ అలీ దండయాత్రలో దెబ్బతింది. కానీ తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలని హుకుం జారీ చేశాడు. ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం పాడుకాలేదు. కానీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేదు. చాలా మంది ఆ ఆలయం ఆమెది కాదని వాదించారు. స్థానికులు ఎన్ని సార్లు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని టీటీడీని వేడుకున్నా పట్టించుకోలేదు. స్వామి పరిపూర్ణానంద స్వామి పోరాటంతో... తల్లి ప్రేమకు ప్రతీకగా ఉన్న వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ కోసం శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. భక్తి పోరాటం చేశారు. న్యాయ స్థానంలో కేసులు వేయించి అనుకూల తీర్పును సాధించారు. టీటీడీనే వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ చేయాలని కోర్టులు సైతం తీర్పు ఇచ్చాయి. స్వామి పోరాటానికి రాజకీయ నేతలు, అధికారులు సైతం తోడ్పాటు అందించారు. దీంతో టీటీడీ రూ.2 కోట్లను మంజూరు చేసింది. 2017 మార్చి 5న ఆలయ జీర్ణోద్ధరణ పనులను స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా ప్రారంభించారు. శరవేగంగా పనులు... పనులు ప్రారంభించిన నాటి నుంచి శరవేగంగా సాగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న కొండకు క్రమపద్ధతిలో ఘాట్ రోడ్డును నిర్మిస్తున్నారు. తర్వాత దశల వారీగా ఇక్కడ నామకరణం, అన్నప్రాçశన, అక్షరాభ్యాసం వంటి సంస్కారాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలివేలు మంగాపురం తరహాలో త్వరలోనే ఇదో దివ్యధామంగా తీర్చిదిద్దనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. – సౌపాటి ప్రకాష్‌బాబు, తిరుపతి -
'తిరుపతిని హిందు సెక్యురిటీ జోన్‌గా ప్రకటించాలి'
తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి ఉగ్రవాదుల ముప్పు ఉందని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. తిరుపతిని హిందు సెక్యురిటీ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. అలాగే నగరంలోని మద్యం షాపులు ఎత్తివేయాలని, అంతేకాకుండా ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు అనుమి ఇవ్వరాదని అన్నారు. అంతేకాకుండా వకుళమాతకు ఆలయం నిర్మించాలని, లేని పక్షంలో వందలాదిమందితో దీక్ష చేపట్టనున్నట్లు స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వకుళమాత గుడి కట్టించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు.