Live Updates
08:04PM
పద్మావతి అతిధి గృహానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సీఎం జగన్ అధికారులతో చేపట్టాల్సిన సమీక్ష రద్దు అయింది. రేపు(శుక్రవారం) తిరుపతిలోని వరద ప్రాంతాలను సీఎం జగన్ పర్యటించనున్నారు. తిరుపతిలో కృష్ణనగర్, ఆటోనగర్, తిరుచానూరు సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది.
07:40PM
చిత్తూరు: పాపానాయుడు పేట నుంచి తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్‌కు సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు.
07:20PM
సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. స్వర్ణముఖి నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెనను సీఎం జగన్ పరిశీలించారు. వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ చూశారు.
05:30PM
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. అనంతరం రేణిగుంట మండలం వెదళ్ల చెరువు ఎస్టీ కాలనీకి సీఎం జగన్ బయల్దేరారు. కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించనున్నారు.
04:45PM
వైఎస్సార్ కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన, అనంతరం తిరుపతి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
03:47PM
సీఎం జగన్ అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించారు. అన్నమయ్య ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో వరద బాధితులకు సీఎం పరామర్శించారు. తీవ్రంగా దెబ్బతిన్న పులపత్తూరులో సీఎం కలియదిరిగారు. సమస్యలపై స్వయంగా ఫీడ్ బ్యాక్ విన్నారు. అక్కడికక్కడే పరిష్కారాల ప్రకటన చేశారు. విధ్వంసం జరిగిన తీరును బాధితుల నుంచి సీఎం తెలుసుకున్నారు.
ఆనాటి ఉత్పాతాన్ని బాధితులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించిన తీరుపై సీఎం బాధితులను అడిగి తెలుసుకున్నారు. సహాయం అందిందా? లేదా? ఆలస్యమైందా? అందరికీ వచ్చిందా? ఇలా అన్నిరకాలుగా సీఎం బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం, యంత్రాంగం పనితీరుపై బాధితుల హర్షం
వ్యక్తం చేశారు.
03:00PM
వైఎస్సార్ జిల్లా: మందపల్లి
వరద బాధితులతో నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ తెలిపారు. వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వరదలతో చాలా నష్టం జరిగిందనే విషయాన్ని సీఎం జగన్ స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్ కొనియాడారు.
01:00PM
వైఎస్సార్ జిల్లా: రాజంపేట మండలంలో సీఎం జగన్ క్షేత్రస్థాయి పరిశీలన
► రాజంపేట మండలం పులపుత్తూరులో వరద బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని తెలిపారు. వరదల వల్ల 293 ఇళ్లు కొట్టుకుపోయాయని, ఇళ్లు కొట్టుకుపోయిన బాధితులందరికీ 5సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని సీఎం జగన్ తెలిపారు.
►వరద బాధితులు, రైతులతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్
►కాసేపట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్
12:05PM
►కాసేపట్లో వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన
►రాజంపేట (మ) మందపల్లి, పులపుత్తూరులో సీఎం జగన్ క్షేత్రస్థాయి పరిశీలన
►నేరుగా వరద బాధితులు, రైతులతో మాట్లాడనున్న సీఎం వైఎస్ జగన్
►అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం జగన్
12:00PM
►మందపల్లె నవోదయ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్
11:00AM
► కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్
► వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానం ద్వారా కడప చేరుకున్న సీఎం
► కడప నుంచి పులమత్తూరు గ్రామానికి బయల్దేరనున్న సీఎం జగన్
► వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటన
► కడపలో సీఎంకు స్వాగతం పలికిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, దాసరి సుధ, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీలు గోవింద రెడ్డి, రమేష్ యాదవ్, సి.రామచంద్రయ్య.
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కడప బయలుదేరారు. రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు.
సాక్షి, అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి గురు, శుక్రవారాల్లో పర్యటించనున్నారు. వైఎస్సార్ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల్లోని పరిస్థితులను పరిశీలించనున్నారు.
► తొలిరోజు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని బాధితులు, రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలిస్తారు. సంబంధిత సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారు. అనంతరం రాత్రికి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు.
► రెండో రోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించి..అధికారులతో సమీక్షిస్తారు.
► సంబంధిత సహాయశిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.
► అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరద నష్టంపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా..
►2వ తేదీ ఉదయం 9.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
►అక్కడి నుంచి 10.50 గంటలకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
►11.10 గంటలకు పులపుత్తూరు గ్రామానికి చేరుకుని అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అనంతరం పులపుత్తూరు సచివాలయానికి చేరుకుంటారు.
►మధ్యాహ్నం 12.30 గంటలకు ఎగువ మందపల్లె గ్రామానికి చేరుకుని గ్రామాన్ని పరిశీలిస్తారు.
►అనంతరం 1.30 గంటల ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
►1.45 గంటలకు తిరిగి నవోదయ విద్యాలయానికి చేరుకుంటారు.
►2.15 నుంచి 2.45 గంటల వరకు నవోదయ విద్యాలయంలో జరిగే జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
►ఆ తర్వాత 3.05 గంటలకు హెలిప్యాడ్ నుంచి చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంటకు బయలుదేరి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment