Updates..
సీఎం జగన్ ప్రసంగం:
►మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది
►58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశాం
►అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం
►వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది.
►14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోంది.
►గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేదు
►అక్క చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడపిస్తున్నాం
►పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించాం
►అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నా
►1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరణా దుకాణాలు నడుపుతున్నారు
►3,80,466 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారు.
►1,34,514 మంది గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నారు
►అమ్మఒడి పథకంతో 53లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వం మనది.
►పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదు.
►గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు.
►గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా?
►వైఎస్సాఆర్ చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు.
►నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళా రిజర్వేషన్లు కల్పించాం.
►మహిళల రక్షణ కోసం దిశా యాప్, దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం.
►కోటి 30 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ యాప్ ఉంది.
►మహిళా సాధికారత లక్ష్యంగా అడుగులు వేశాం.
►వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం.
►99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే పొదుపు సంఘాలు నెంబర్ వన్‌గా ఉన్నాయి.
►చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75వేలు ఇస్తున్నాం.
►31 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చాం.
►గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా?.
►ఎక్కడా లంచాలు లేవు.
- చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరి పేర్లు చెబితే ఏం గుర్తుకొస్తుంది?
- చంద్రబాబు పేరు చెబితే ఆయన మోసాలు..
- పవన్ కల్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం.
- కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారు.
- 2014లో వీరిద్దరి మేనిఫెస్టోలో ఏం చెప్పారు..
- 2014లో పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు.
- ఆడ బిడ్డ పుట్టిన వెంనే రూ.25వేలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామన్నారు.
- దీనికి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు.
- కానీ, వారు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు.
- ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా నియమించలేదు.
►పిసినికాడ చేరుకున్న సీఎం జగన్
►అనకాపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
►అనకాపల్లి బయలుదేరిన సీఎం జగన్
►గన్నవరం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్
►తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు.
►రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు గురువారం నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
►వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది.
►నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్టవుతుంది.
14 రోజులపాటు ఉత్సవంలా..
►ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు.
వ్యాపార దిగ్గజాల ద్వారా అదనపు తోడ్పాటు
♦ వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలు ఆ మొత్తాలను వారివారి ఇష్టం మేరకు వినియోగించుకునే
వెసులుబాటు కల్పించారు.
♦ లబ్దిదారుల్లో ఎవరైనా ప్రభుత్వం అందజేసే సాయంతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తే వారికి అదనపు తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం గతంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంది.
♦ మూడు విడతల్లో లబ్ధి పొందిన మహిళల్లో ఇప్పటివరకు 16,55,591 మంది వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభించి ప్రతి నెలా స్ధిర ఆదాయం పొందుతున్నారు.
♦ ఈ ఏడాది కొత్తగా జీవనోపాధులు ఏర్పాటుకు ముందుకొచ్చే లబ్దిదారులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా లేదంటే స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఇప్పించేందుకు మండల అధికారులు తగిన చర్యలు చేపడతారు.
♦ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఇప్పటికే వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి విజయగాధలను ఇతర లబ్దిదారులకు తెలియజేసేలా కార్యక్రమాలను, ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment