సీతారాముల అనుగ్రహంతో అందరికీ శుభాలు కలగాలి | CM YS Jagan wishes people on the eve of Sri Rama Navami | Sakshi
Sakshi News home page

సీతారాముల అనుగ్రహంతో అందరికీ శుభాలు కలగాలి

Published Sat, Apr 9 2022 8:48 PM | Last Updated on Sun, Apr 10 2022 12:04 PM

CM YS Jagan wishes people on the eve of Sri Rama Navami - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన, లోక కల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం. ఆ ఆదర్శ మూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్‌.

అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

చదవండి: (తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement