
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా): కరోనాను జయించిన కానిస్టేబుల్‌కు పోలీస్ స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. వివరాల ప్రకారం.. తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కానిస్టేబుల్ సత్యనారాయణకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో 28 రోజలపాటు క్వారంటైన్‌లో ఉన్న అనంతరం విధులకు హాజరయ్యారు. దీంతో స్టేషను వద్దనే కానిస్టేబుల్ సత్యనారాయణకు శాలువా, పూలమాలతో ఎస్సై విజయబాబు సాదరంగా ఆహ్వానించారు. మిగతా సిబ్బంది కూడా పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఇక రెండు రోజుల క్రితం వివాహమైన అమలాపురం పట్టణం పద్మినీ పేటకు చెందిన యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment