Doctor Died Due To Corona In East Godavari: కరోనా సోకి డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ మృతి - Sakshi

తూర్పుగోదావరి: కరోనా సోకి డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ మృతి

Published Thu, Apr 22 2021 1:34 PM | Last Updated on Thu, Apr 22 2021 1:49 PM

East Godavari: Doctor Died Due To Covid - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో దంత వైద్యుడిగా పనిచేస్తున్న ముప్పన సతీష్‌కుమార్‌ (45) బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ఒక ప్రయివేట్‌ ఆసుపత్రిలో మృతి చెందారు. సీహెచ్‌సీ సిబ్బంది సమాచారం మేరకు ఐదు రోజుల క్రితం కరోనా లక్షణాలతో సతీష్‌కుమార్‌ రాజమండ్రిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం నుంచి ఆరోగ్యం విషమించింది. సాయింత్రం 4గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే  వెంటనే జగ్గంపేట సీహెచ్‌సీలో విషాదం నెలకొంది. కొంతమంది వైద్యులు,సిబ్బంది రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. సతీష్‌ కుమార్‌  రెండు సంవత్సరాలుగా జగ్గంపేటలో  పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం పెద్దాపురం. 

కరోనాతో మహిళ మృతి.. 
సఖినేటిపల్లి: మండల పరిధిలోని ఉయ్యూరువారి మెరకలో బుధవారం 55 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందింది. ఈ విషయాన్ని మోరి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రతిమ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement