ఆర్బీకేల్లో ఇ–పంట వివరాల ప్రదర్శన | Display of e-crop details in Rythu bharosa centres | Sakshi
Sakshi News home page

ఆర్బీకేల్లో ఇ–పంట వివరాల ప్రదర్శన

Published Mon, Oct 12 2020 4:50 AM | Last Updated on Mon, Oct 12 2020 4:50 AM

Display of e-crop details in Rythu bharosa centres - Sakshi

సాక్షి, అమరావతి:  రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ఇ–పంట నమోదు వివరాలను ఆదివారం నుంచి ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు (వీఏఏ) తెలియజేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, పంట వివరాలు నమోదు కాకున్నా, రైతు పేరు లేకున్నా తక్షణమే ఇ–పంట వివరాలు నమోదు చేయించుకోవాలి. లేకుంటే ఆ పంటను కొనుగోలు చేయరు. ఈ ఏడాది నుంచి ఆర్బీకేల వద్దనే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement