
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఈనెల 11వ తేదీనుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈసారి రెండో శనివారం, ఆదివారాలు కలసి రావడంతో సెలవు రోజుల సంఖ్య పెరగనుంది. 11వ తేదీనుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు దసరా సెలవులుగా పాఠశాల విద్యా క్యాలెండర్‌లో పొందుపరిచారు.
అయితే ఈనెల 9వ తేదీ రెండో శనివారం, ఆ తరువాత 10వ తేదీ ఆదివారం కావడంతో పాఠశాలలు 8వ తేదీ వరకే పనిచేయనున్నాయి. ఇక 17వ తేదీ ఆదివారం రావడంతో పాఠశాలలు 18వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. దసరాకు మొత్తంగా 9 రోజులు సెలవులు కలసి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment