సాక్షి, పుంగనూరు: అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు బరితెగించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై మారణాయుధాలతో దాడులు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వారిపై సానుభూతి చూపించాల్సిందిపోయి ఎల్లో మీడియా విష ప్రచారానికి దిగింది.
పుంగనూరు ఘటనలో గాయపడిన వారిపై విష ప్రచారానికి తెరలేపింది రామోజీరావు ఈనాడు. సిగ్గులేకుండా ఈనాడు పేపర్ బ్యానర్ సోర్టీలో బాధితులపై తప్పుడు వార్త రాసుకొచ్చింది. అంగళ్లులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త అర్జున్ రెడ్డి గాయపడితే.. అతడిని టీడీపీ కార్యకర్తగా చూపిస్తూ బ్యానర్ స్టోరీలో ఈనాడు ఆయన ఫొటో వేసుకుంది. శుక్రవారం చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ గూండాలు దాడి చేస్తూ విసిరిన రాయి కారణంగా అర్జున్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
తాజాగా, అర్జున్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నేను అంగళ్లులో రైతును. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను. నిన్న(శుక్రవారం) టీడీపీ నేతలు చేసిన దాడిలో నేను తీవ్రంగా గాయపడ్డాను. ఆసుపత్రిలో చికిత్స కూడా పొందాను. ఈరోజు ఈనాడు పేపర్‌లో మొదటి పేజీలో నా ఫొటో వేసి టీడీపీ కార్యకర్త అని రాసుకొచ్చారు. ఇది నిజం కాదు. ఇలా చేయడం తప్పు అని ఖండించారు.
ఇక, గతంలో కూడా టీడీపీ నేత పట్టాభి గాయాల విషయంలోనూ పాత ఫొటోల్ని వేసి ప్రభుత్వంపై ఈనాడు బురద చల్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తప్పు తెలుసుకుని రామోజీ లెంపలేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment