మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు | Ex Minister Jogi Ramesh Faces Another Illegal Case | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు

Mar 26 2026 8:18 PM | Updated on Mar 26 2026 8:25 PM

Ex Minister Jogi Ramesh Faces Another Illegal Case

విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కేసులు బనాయిస్తుంది కూటమి ప్రభుత్వం. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు స్టేషన్‌లో ఫిబ్రవరి 2న జోగి రమేష్‌ పై కేసు నమోదు చేశారు పోలీసులు. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చాఉ భట్టిప్రోలు పోలీసులు. 

గత నెలలో జోగి రమేష్‌పై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వాహించారని. జన సమూహాన్ని పోగు చేశారంటూ సెక్షన్‌ 30 యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై నమోదు చేశారు. మళ్లీ నెల వ్యవధిలోనే ఏదో కారణం చూపుతూ జోగి రమేష్‌పై కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement