సాక్షి, విజయవాడ : కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ కమిటీని నియమించింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గల కోవిడ్ సెంటర్లను పరిశీలించాలని ఆ కమిటీని రాష్ట్ర హోంశాఖ ఆదేశించింది. తాజా ఘటనకు కారణాలపై విచారణ జరపాలని, ఫైర్స్ విభాగం డీజీ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీని నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా ఫైర్స్ డీజీ, సభ్యులుగా ఏపీ ఫోరెన్సిక్ లబోరటరీస్ డైరెక్టర్, చీఫ్ ఎలక్ట్రికల్ ఐన్స్పెక్టర్ ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో అన్ని కోవిడ్ 19 సెంటర్ల లోను భద్రత ప్రమాణాలను అధ్యయనం చేయనుంది.
కాగా విజయవాడలోని రమేష్ హాస్పిటల్ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం నేపథ్యంలో భవిష్యత్‌ను ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. విజయవాడ ఘటనతో పాటు, అన్ని కోవిడ్ సెంటర్లలో భద్రత ప్రమానాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రమాదాలు నివారించేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు ఇప్పటికే స్వర్ణ ప్యాలెస్ కేసు నమోదు చేశామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఐపీసీ సెక్షన్ 304, 308, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment