Heavy rains likely in South Coastal Andhra Pradesh: IMD - Sakshi
Sakshi News home page

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్‌..

Published Wed, Mar 15 2023 7:24 AM | Last Updated on Wed, Mar 15 2023 5:36 PM

Heavy Rains Likely In Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం/గుంటూరు రూరల్‌: రాష్ట్రంలో బుధవారం నుంచే వర్షాలు మొదలు కానున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసినట్టుగా ఈ నెల 16 నుంచి కాకుండా ఒకరోజు ముందుగానే వానలు కురవనున్నాయి. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధవారం నుంచి 4 రోజులపాటు వర్షాలకు ఆస్కారం ఉంది.

పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం  వెల్లడించిం­ది. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదా­వరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.

గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు­గాలు­లు వీస్తాయని పేర్కొంది. పంటలు దెబ్బతినకుండా జాగ్ర­త్తలు తీసుకోవాలని రైతు­ల­కు సూచించింది. కర్నూలు జిల్లా మంత్రాల­యంలో 40.65, నంద్యాల జిల్లా గాజులపల్లిలో 40.61, అవుకులో 40.53, గోన­వరంలో 40.1 డిగ్రీల చొప్పున మంగళవారం ఉష్ణోగ్రతలు రికార్డయ్యా­యి. ఇటీవల కాలంలో ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి.
చదవండి: సంక్షేమం తోడుగా 'అభివృద్ధి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement