సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం మధ్యాహ్ననికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి సాయంత్రం 3.30–4.30 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా వద్ద తీరాన్ని దాటింది.
ఆపై ఈ వాయుగుండం మళ్లీ పశ్చిమ బెంగాల్‌లో తీరంలోని దిఘా సమీపంలోకి ప్రవేశించి కోల్‌కతాకు తూర్పున 120 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ గురువారం నాటికి బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి బులెటిన్‌లో తెలిపింది.
చదవండి: విశాఖలో కారు బీభత్సం.. మద్యం మత్తులో మహిళ రాష్ డ్రైవింగ్
మరోవైపు రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment