
తిరుమల: ఆపద మొక్కులవాడికి సాధారణంగా మే, జూన్ నెలల్లో మాత్రమే హుండీ ద్వారా లభించే ఆదాయం నెలకు రూ.100 కోట్లు దాటేది. మిగిలిన నెలల్లో నెలకు రూ.100 కోట్లలోపే ఉండేది. ప్రస్తుతం శ్రీవారికి నిత్యం రూ.4 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తోంది.
టీటీడీ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నుంచి ప్రతినెలా హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. గడచిన 11 నెలల్లో రూ.1,415.21 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.1,500 కోట్ల మార్కును దాటిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment