Srivari hundi
-
భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
-
హుండీ ఆదాయంలో రికార్డుల మోత
తిరుమల: ఆపద మొక్కులవాడికి సాధారణంగా మే, జూన్ నెలల్లో మాత్రమే హుండీ ద్వారా లభించే ఆదాయం నెలకు రూ.100 కోట్లు దాటేది. మిగిలిన నెలల్లో నెలకు రూ.100 కోట్లలోపే ఉండేది. ప్రస్తుతం శ్రీవారికి నిత్యం రూ.4 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తోంది. టీటీడీ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నుంచి ప్రతినెలా హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. గడచిన 11 నెలల్లో రూ.1,415.21 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.1,500 కోట్ల మార్కును దాటిపోనుంది. -
తిరుమల: 2022 గణాంకాలను విడుదల చేసిన టీటీడీ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2022వ సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 2,35,58,325 మంది భక్తులు స్వామి వారిని దర్శించకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.1,446 కోట్లకు చేరింది. 1,08,51,706 మంది భక్తులు గడిచిన సంవత్సరకాలంలో స్వామి వారికి తలనీలాలను సమర్పించారు. 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. చదవండి: (AP: సీఐడీ చీఫ్ సునీల్‌కు డీజీగా ప్రమోషన్) -
సిరులు కురిపిస్తున్న శ్రీవారి హుండీ.. వరుసగా తొమ్మిదో నెల రూ.100 కోట్లు..
సాక్షి, తిరుమల: శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఈ ఏడాది వరుసగా తొమ్మిదో నెల హుండీ ఆదాయం రూ.100 కోట్లను దాటింది. ఈ వార్షిక సంవత్సరం (టీటీడీలో మార్చి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు)లో హుండీ ద్వారా రూ. 1,000 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది. అయితే, మార్చి నుంచి నవంబరు వరకు 9 నెలలు నెలకు రూ. 100 కోట్లు దాటి హుండీ ఆదాయం వచ్చింది. గత 8 నెలల్లోనే రూ.1,164 కోట్లను దాటేసింది. నవంబరు నెలలో రూ.127.30 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో శ్రీవారికి రూ.1,600 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుందని టీటీడీ భావిస్తోంది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఇలా హుండీ ద్వారా శ్రీవారికి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇప్పటికే టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.15,938 కోట్లు దాటగా, బంగారం నిల్వ 10,258 కేజీలు దాటింది. 1950వ సంవత్సరం వరకు శ్రీవారికి నిత్యం లభించే హుండీ ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండగా, 1958లో మొదటిసారి లక్ష రూపాయలు దాటింది. 1990కి నిత్యం కోటి రూపాయలు పైగా హుండీ ఆదాయం లభించడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఏటేటా పెరుగుతోంది. 2010 అక్టోబర్ 23న రూ.3.6 కోట్లు, 2011 నవంబర్ 1న రూ.3.8 కోట్లు, 2012 జనవరి 1న రూ.4.23 కోట్ల ఆదాయం వచ్చింది. 2012 ఏప్రిల్ ఒకటో తేదీన అత్యధికంగా రూ.5.73 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జూలై 4వ తేదీకి రూ.6 కోట్లు దాటేసింది. 2015–16 సంవత్సరంలో హుండీ ఆదాయం రూ.1,000 కోట్లు దాటగా, 2019 – 20లో రికార్డు స్థాయిలో రూ.1,313 కోట్లు రావడం విశేషం. కోవిడ్ కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. 2020 –21లో రూ.731 కోట్లు, 2021–22లో రూ.933 కోట్లు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది. వరుసగా 9వ నెల కూడా స్వామికి లభించిన హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. కోవిడ్ కారణంగా రెండేళ్లు శ్రీవారి దర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆదాయం పెరుగుతున్నట్లు టీటీడీ చెబుతోంది. చదవండి: (రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి) -
చరిత్రలో తొలిసారి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారిని 22.22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ చరిత్రలోనే తొలిసారి ఒకే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.140.34 కోట్లు వచ్చింది. ఇదే ఏడాది జూలైలో రూ.139.45 కోట్లు, మే నెలలో రూ.130.50కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్ట్ నెలలో 1.05 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయి. మొత్తం 47.46 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. 10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. చదవండి: (మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..) -
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి
తిరుమల: వడ్డికాసుల వాడికి భక్తులు సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి. కరోనా తరువాత ఈ సంవత్సరం నుంచి సర్వదర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించడంతో.. గత రెండేళ్లుగా తిరుమలకు రాలేని భక్తులు స్వామిని దర్శించుకుని భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటున్నారు. టీటీడీ అధికారికంగా మంగళవారం హుండీ కానుకల లెక్కను ప్రకటించనుంది. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 37,447 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.9 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్మెంట్లు నిండాయి. చదవండి: (అరటి ధరహాసం.. హెక్టారుకు రూ.15లక్షల ఆదాయం) -
శ్రీవారి హుండీలో రూ.4 కోట్ల విలువైన వజ్రాల బంతి
సాక్షి, తిరుమల: కోర్కెలు తీర్చే కొండలరాయునికి విలువైన కానుకలు హుండీ ద్వారా అందుతున్నాయి. శుక్రవారం హుండీ లెక్కింపుల్లో సుమారు ఫుట్‌బాల్ బంతి రూపంలో వజ్రాలు పొదిగిన బంగారు బంతిని గుర్తించారు. మేలిమి రకానికి చెందిన విలువైన తెలుపు రంగులోని వజ్రాలతో కూడిన ఈ బంతి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఓ అజ్ఞాత భక్తుడు ఈ బంతితో పాటు రూ.5 లక్షల నగదు కూడా హుండీలో సమర్పించారు.