
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారిని 22.22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ చరిత్రలోనే తొలిసారి ఒకే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.140.34 కోట్లు వచ్చింది.
ఇదే ఏడాది జూలైలో రూ.139.45 కోట్లు, మే నెలలో రూ.130.50కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్ట్ నెలలో 1.05 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయి. మొత్తం 47.46 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. 10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment