
సాక్షి, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తలిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. వివరాల ప్రకారం.. నెల్లూరులోని మినీ బైపాస్‌రోడ్డులోని ఏఎన్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద కృష్ణారావు, అతడి భార్య పద్మ నివాసం ఉంటున్నారు.
కాగా, శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు వారింట్లోకి దూరి.. దంపతులిద్దర్నీ దారుణంగా హత్య చేశారు. అనంతరం.. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని దోచుకొని ఇంటి వెనుక ద్వారం గుండా పారిపోయారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment