
మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్న ఉక్కు పోరాట కమిటీ నాయకులు
ఉక్కు నగరం (గాజువాక): తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్)ను విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరానికి పోరాట కమిటీ నాయకులు ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి కేటీఆర్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో–కన్వీనర్ గంధం వెంకటరావు శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. స్టీల్‌ప్లాంట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానం, చేస్తున్న ఉద్యమం గురించి ఆయనకు వివరించి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించాలని కోరారు.
ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్లాంట్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఉక్కు పరిరక్షణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేసినట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తాను విశాఖ వస్తానని చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment