
సాక్షి, నెల్లూరు : పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే అడ్డుపడిన టీడీపీనే ఇప్పుడు రోడ్డెక్కి చిల్లర రాజకీయాలు చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కోర్టులో కేసులు వెనక్కి తీసుకోమని మీ చంద్రబాబుకి చెప్పండని మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ నేతల సిగ్గుమాలిన చర్యలు ఎండగట్టేందుకు అవసరమైతే మహిళలతో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పేదలకు మహిళల పేరుతో ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు డివిజన్లలో పర్యటించిన మంత్రి ,ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. (పోలవరంలో చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవిగో..)
Comments
Please login to add a commentAdd a comment