
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిని నియమించింది న్యాయశాఖ. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ స్పెషల్ సెక్రటరీ రజిందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీ చేశారు.
వెంకటశేషసాయి ఇప్పటివరకు ఏపీ హైకోర్టులో జడ్జిగా కొనసాగారు. తాజాగా ఆయనకు చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిదాకా హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యవహరించారు. మిశ్రాకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment