సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని ఆయన తెలిపారు. నవంబర్, డిసెంబర్‌లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన‍్నారు. దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ( బాబేమో పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు..! )
గతంలోలాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదన్నారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఉందని, వాటితో స్థానిక సంస్థల ఎన్నికలు పోల్చకూడదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment