సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్‌ను క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి నడింపల్లి నాని రాజు, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లూరి సీతారామరాజు పేరుతో నూతన జిల్లాను ఏర్పాటు చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌ను సన్మానించారు.
చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం?
అలాగే అల్లూరి 125వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ధన్యవాదాలు తెలిపారు. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ సామాజికవర్గంలోని పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు సీఎంకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, క్షత్రియ సేవా సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ రఘురామరాజు, వి.వెంకటేశ్వరరాజు, అఖిల భారత క్షత్రియ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ దాట్ల, భీమవరం క్షత్రియ పరిషత్ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు, దక్షిణ భారత క్షత్రియ సంఘం సభ్యులు మంతెన సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment