
సాక్షి, విశాఖపట్నం: దసపల్లా భూములతో ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధంలేదని భూమి హక్కుదారులు స్పష్టం చేశారు. కాగా, భూహక్కుదారులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దసపల్లా భూములతో ఎంపీ విజయసాయిరెడ్డి సంబంధం లేదు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. దసపల్లా భూములు క్లియరెన్స్ కావడం సంతోషం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపడతాము. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment