పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన బాబు: వైఎస్ జగన్
డబ్బుల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర
అందుకే 12 మెడికల్ కాలేజీల్లో సీట్లు అడ్డుకుంటున్నారు
సూపర్ సిక్స్.. అంటే ఏంటని అడుగుతున్నారు
పంటలకు ఉచిత ఇన్సూరెన్స్ లేదు.. ఈ–క్రాప్ లేదు..
కుప్పకూలిన వలంటీర్ల వ్యవస్థ.. సచివాలయ వ్యవస్థా నాశనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : డబ్బుల కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాముల కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీ, ప్రతి గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు ఉండేట్టుగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ఈ రోజు మళ్లీ పరిస్థితి మొదటి కొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మందుల కొరత వేధిస్తోందని, నాడు–నేడు ఆగిపోయిందని చెప్పారు.
గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిలను బుధవారం ఆయన ములాఖత్‌లో కలుసుకున్న అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు కట్టడం మొదలు పెట్టి, అందులో ఐదు అప్పటికే పూర్తి చేసిందని తెలిపారు. ఆ ఐదు కాలేజీల్లో సీట్లు తెచ్చుకుని, ఇంకో ఐదు కాలేజీల్లో ఇప్పుడు సీట్లు తెచ్చుకునేందుకు అన్ని పనులు చేసి పెడితే, చంద్రబాబు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందని వివరించారు. ‘మామూలుగా జనవరిలో ఏదైనా ఆస్పత్రి బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు. మార్చి 16న కోడ్ వచ్చింది. ఇక అంతే. జనవరి నుంచి ఇప్పటి దాకా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల బిల్లులు రూ.2 వేల కోట్ల పైచిలుకు దాటాయి. ఇంత వరకు ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్య ఆసరానూ అటకెక్కించారు. 104, 108 ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం లేదంటున్నారు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
‘సూపర్ సిక్స్’ హామీలు ఏమయ్యాయి?
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడున్నర నెలలు దాటుతున్నా.. టీడీపీ ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవె¯Œన్ హమీలు ఏమయ్యాయో తెలియడం లేదు. సూపర్ సిక్సా.. అంటే ఏమిటి? నాకు గుర్తు లేదే? అని సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నారు. అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మలకు రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. 50 ఏళ్ల పైన వయసున్న మహిళలకు జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం రూ.18 వేలేనని.. చంద్రన్న మీకు ఏటా రూ.48 వేలు ఇస్తాడు.. సంతోషమేనా? అన్నారు. 20 ఏళ్ల పిల్లలకు నెలకు రూ.3 వేలు అని చెప్పారు.
ప్రతి రైతుకు రూ.20 వేలు అని ఊరించారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను చేసిన తప్పులు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఇకనైనా ప్రజలకు మేలు చేయాలి. లేకపోతే పుట్టగతులు ఉండవు. వచ్చే ఎన్నికల్లో వారికి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి ఖాయం. అదే ఈరోజు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంటే.. రైతులందరికీ ఈపాటికే రైతు భరోసా సొమ్ము పడి ఉండేది. రైతులందరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ అంది ఉండేది.
విపత్తులతో ఇంత ఆస్తి, పంట నష్టం జరుగుతున్నా, ఎక్కడా ఆదుకునే కార్యక్రమం జరగడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి, వాటిపై సోషల్ ఆడిట్ చేసి.. ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా? అందరికీ వచ్చిందా? అన్ని ఊర్లూ నమోదయ్యాయా? అని చూసే కార్యక్రమం జరగడం లేదు. సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి. గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం కూడా పోయింది.
అర్హత ఉన్నా రాని వాళ్లు ఎవరైనా ఉంటే మళ్లీ నమోదు చేసుకోవాలన్న విధానం కూడా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం లేదు. ఉచిత ఇన్సూరెన్స్ లేదు. ఈ–క్రాప్ లేదు. ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేకుండా పోయింది.
విద్యా దీవెన పెండింగ్.. డోర్ డెలివరీ బంద్
జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం.. ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికం.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్ పెట్టారు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకోసారి విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ, పిల్లాడు/పాప ఉమ్మడి ఖాతాలో నేరుగా పడిపోయేది. వసతి దీవెన ఎగరగొట్టేశారు. అమ్మ ఒడి అన్నది గాలికి వదిలేశారు. గోరుముద్ద చంద్రబాబు ప్రభుత్వంలో తినలేక ధర్నాలు చేస్తూ ఆస్పత్రులకు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియం గాలికొదిలేశారు.
మూడో తరగతి నుంచి పీరియడ్‌గా పిల్లలకు నిర్వహించిన టోఫెల్ క్లాసులనూ ఎత్తేశారు. మా ప్రభుత్వంలో ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్, రేషన్‌న్‌ఇంటికే వచ్చేది. అదే ఈ రోజు పెన్ష¯Œ రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రేషన్ ఇంటికి రావడం దేవుడెరుగు.. వస్తే చాలు అన్నట్టు తయారైంది. ఇంటి వద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థ కుప్పకూలింది. సచివాలయ వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలి!
Comments
Please login to add a commentAdd a comment