
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరిన్ని నిధులను కేటాయించాలని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను రాష్ట్ర పరి శ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. పీఎల్‌ఐ స్కీం కింద కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ గృహోప కరణాల తయారీ యూనిట్ల ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ(ఐసీఏటీ) ఏర్పాటు, తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ రీచార్జింగ్‌కు స్వాపింగ్ స్టేషన్లు వంటివి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో అమితాబ్‌కాంత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రతి పాదనలను నీతిఆయోగ్ ముందుంచారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రాయితీ ధరలపై అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ ఈఎంసీని సందర్శించండి
వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ ఈఎంసీకి నిధులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు మేకపాటి కృతజ్ఞ తలు తెలియచేశారు. ఈఎంసీ పనులను పరిశీలిం చేందుకు రావాలని ఆహ్వానించారు. రూ.116.75 కోట్లతో వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న స్టేట్ డేటా సెం టర్‌కు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. కేం ద్ర పరిశ్రమలు, వాణిజ్య కార్యదర్శి అనూప్ వదావ న్‌ను కూడా మేకపాటి కలుసుకున్నారు. ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా, పరిశ్రమలశాఖ సలహా దారు శ్రీధర్ లంకా తదితరులు పాల్గొన్నారు.