అమరావతి: ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దళారులు లేకుండా పారదర్శక పన్ను విధానం రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని పన్ను విధానాలనూ పరిశీలించి, అత్యుత్తమ పన్ను విధానాన్నే రాష్ట్రంలో తీసుకొచ్చామని మంత్రి బొత్స పేర్కొన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి అదనంగా రూ.123 కోట్లు కేటాయించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. అంతేకాకుండా ఆస్తి పన్ను పెంపు 15 శాతానికి పరిమితం చేశామని, ఇది చాలా తక్కువ అని ఆయన తెలిపారు.
కాగా అమర్ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. తప్పు చేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారని తెలిపారు. వాళ్లు వెళ్లిపోవాలని మేము కోరుకోవడం లేదన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జల వివాదంలో తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నట్లు వెల్లడించారు. జల వివాదాన్ని పరిష్కరించు కోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. చట్టం చేసిన రోజే 3 రాజధానులు అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇక రాజధానుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు: మంత్రి బొత్స
Published Tue, Aug 3 2021 5:51 PM | Last Updated on Tue, Aug 3 2021 6:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment